Friday 8 July 2011

దాన వీర శూర కర్ణ - కుంతి కర్ణుడి డైలాగ్స్

కర్ణుడు : పాండవమాత.. రాధాసుతుని నమఃస్సుమాంజలి.

కుంతి : ఆ పేరుతోనన్ను పిలవకు కర్ణా ! ఎంతోమక్కువతో నిన్ను కన్నానురా !

కర్ణుడు : అని ఈనాడు చెప్పటానికి... మాతృప్రేమ కుమ్మరించటానికి వచ్చావా ?

కన్నప్పుడు అమ్మగా కాకపోయినా... కనీసంఒక ఆడుదానిగా అక్కున జేర్చి గుక్కెడు 

పాలీయనిదానివి, నేడు నీ పాపపరిహారానికి రణరంగంలో నరబలిగా నన్నిచ్చి కులదేవతకు 

హారతి పట్టాలని వచ్చావా ? ఇంతకాలం నీ బిడ్డ సూతుడని, సూతుడని లోకం 

కోడైకూసిన వర్తనం నీ కల్లబొల్లి కన్నీటితో మాపుచేయాలని వచ్చావా ?

ఆ నాడు నీ మధురస్వప్నాలు పండించుకోటానికి కర్మసాక్షితో నన్ను కన్నావు,

నీ భావిజీవితస్వప్నాలు పండించుకోటానికి ఆ కాళకరాళ రాత్రిలో 

కన్నుతెరవని పసికందును నన్ను దూరంగా గంగలో విసిరి పారవేశావు. నాడే నాకీర్తి

నశించింది. నీ హత్యాచారంవల్ల రాజగురు సంస్కారాలు, సుక్షత్రియ నామము 

యశస్సు నాకు దూరమయ్యాయి. ఇంతకంటే కన్నతల్లివిగా నీవు చేయగలిగిన 

అపకారమింకేమున్నది ! ఈనాడు నీ పుత్ర స్వప్నాలు పండించుకోటానికి నీ 

అభిజాత్యమహావృక్షం నుండి ఎన్నడో ఎక్కడో రాలిన ఈఫలాన్ని ఏదో ప్రతిఫలం అపేక్షించే 

ఆశ్రయించటానికి వచ్చావు అంతేగా ?



కుంతి : అంత మాట అనకు బాబు.. కన్న బిడ్డలందరూ ఒక్కటై ఉండగా చూచే అదృష్టం ఆ 

భగవంతుడు నాకు లేకుండా చేసాడు 

కర్ణుడు :కాదు నీకు నీవే చేసుకున్నావు.. నీవేకాదనుకున్నది తానౌననుకొని తిరిగి నీ దరికి 

ఎలా వస్తుంది ? అయినా నీకెందుకింతబాధ ? నాకేం బలపరాక్రమాలు లేవనా , రాజ్యం లేదనా , 

అండదండలు లేవనా ... నాకు లేనిది ఏదిఆశించి నీ బిడ్డలా పక్షానికి రమ్మంటావ్ ?

ఆనాడు నీ రక్తమాంసాలముద్దగా పుట్టిన నన్ను నిర్దాక్షిన్యంతో నీవు నీల్లకప్పగిస్తేపుత్రప్రేమతో 

స్వీకరించి మక్కువతో చనుబాలిచ్చి పెంచిందినా తల్లి రాధ. బిడ్డలుండి 

గొడ్రాల్లైన వాళ్ళు కొందరుంటే, బిద్దలుడిగిన సంతానవతి మా అమ్మ రాధ

కుంతి : అవునయ్యా, ఆ నాడు నువ్వు నా బిడ్డవని ఎలా చెప్ప లేకపోయానో, నేడు నువ్వు అలాగే కుంతి నాతల్లని చెప్పకపోవటంలో తప్పులేదు. గతిమాలి నా ఐదుగురు బిడ్డల

క్షేమం ఒక కంట చూచుకొంటూ మంచిరోజులెంచుకుంటూ బ్రతుకుతున్నాను . ఈ పరిమారేవయసులో పుత్రహీనగా నేను జీవించలేను, అందుకే అపాండవం చేయవద్దని కన్నకొడుకు ముందు కొంగుపట్టియాచించటానికి వచ్చాను, పుత్ర భిక్ష పెట్టు.

కర్ణుడు : పుత్ర భిక్ష! అడగటానికి నీకు నోరెలావచ్చింది ?

కుంతి : తండ్రీ !

కర్ణుడు : ఏ స్వామీ ఉప్పుపులుసులతో నేనింతకాలంబ్రతికానో , ఏ స్వామి సమతవీక్షనాలతో నేనొక వీరాధివీరునిగా నిలిచిమహారాజునయ్యనో... ఆ స్వామీ వెలలేని తులలేని ఋణ మమనేకం తీర్చుకొనే సమయం వచ్చింది. రాజరాజు ఔదార్యంతో జీవించే నాకిది పరీక్షా సమయం.ఈ దుర్లక్ష్య మహాసమరసాగారాన్ని నా మీద నమ్మకముంచే నా రాజు రాసానికి సాహసించాడు , ప్రత్యుపకారంతో స్వామీ ఋణం తీర్చి రాధేయుడు శీలవంతుడు, నీతివంతుడు, ధర్మవర్ధనుడనిశాశ్వత 

యశఃక్కాముడను కమ్మంటావా ? లేక, మానవసహజములైన ప్రలోభాలకు, ఆశలకు, ఆకర్షలకు లోనైకౌంతేయుడు స్వామిద్రోహి, మిత్రద్రోహి నీచుడుఅన్న శాశ్వత లోకనిందకు బలి కమ్మంటావా ? యశోవంతమైన చంద్రవంశపు మహారాజ్ఞిగా , పాండురాజు దేవేరివిగా , కడుపు పండించుకొనికన్న తల్లివిగా నీ తుది నిర్ణయం చెప్పు ? తనయున్ని దూరంజేసుకోవటానికితెగించినదానివి, నేను నీ బిడ్డలతో కలవకపోయినా భరించగలవు , కాని కర్మసాక్షి కొడుకు దుష్కామకర్ముడన్నఅపఖ్యాతితో నేను జీవించలేను.



ఏ మచ్చుకు వెరసి నీవు నన్ను దూరంచేసుకోన్నవో తిరిగి ఆ మచ్చ నావల్ల నీకు రావాలనినేను కోరను, రానివ్వను . ధార్తరాష్ట్రుల కోసం నా సర్వం ధారవోస్తాను. నీ కొడుకులతో యుద్ధంచేసి తీరుతాను .

కుంతి : బాబూ!

కర్ణుడు : ఆనులే నీవేనాడో వదలివేసిన బిడ్డనునేను. నేనేమైన నీకు బాధలేదు. ఇప్పుడు కూడా పాండవులను చంపవద్దని కోరడానికి వచ్చావేకాని,నీ తొలి బిడ్డ కర్ణుడు బ్రతకాలని కోరి నీవు రాలేదు.

నీవుమాతృ స్థానానికి ఏ మాత్రం అర్హురాలివి కావు, కాకపోతే నా జన్మకు కారణమైన ఒకానొక ఆడుదానివి. నా పుట్టుకవల్లనీకు సుఖం లేదు, అమ్మా అని పిలుచుకొనే అదృష్టం నాకు లేదు, ఏ క్షణాన నీ గర్భావాసాన ప్రవేశించానో,నీకు దుర్భర క్లేశాలు కలుగాజేసాను. లజ్జా జనకున్నయ్యాను, స్వజనానికి దూరమయ్యాను, పరాన్నంభక్షించాను, పరాదీనున్నై పొట్టనింపుకుంటున్నాను, నీచునిగా సంఘంలో నిలబడ్డాను.నీతికిధర్మానికి కట్టుబడి తమ్ముళ్ళతో తారసిల్లుతాను.

అయిన, అడిగినదానిని లేదనక ఇచ్చే ఈ రాధేయుడు కొంగుచాచియాచించిన ఒకానొక దీన మాతృమూర్తిని కాదనే ధర్మహీనుడు దయాహీనుడు కాదు. ఇదే నీకు నా వాక్ధానం, చిక్కినా దక్కినా ధర్మజభీమనకులసహదేవులకు ప్రాణ హాని కలిగించను. సవ్యసాచికి సమజోదుగాసర్వకాల సర్వావస్థలయందును నా మీదే నమ్మకముంచుకున్న నా రాజుకు ద్రోహం చేసి నీను నికృష్టుడనుకాలేను . నీ కొడుకు పార్థుడు ఎదురైనప్పుడు అతన్ని అంతం చేయగలిగానా నా స్వామి ఋణం తీర్చిన వాన్నౌతాను లేదా శూరవరేన్యులు చేరే సురలోకంలోసుస్థిరమైన యశోలక్ష్మిని చేపట్టినవాన్నౌతాను. నీ పంచపాండవులను నీకే విడచి నీ కోర్కెనెరవేర్చిన వాన్నౌతాను. ఏది ఏమైనా నీకు లోకానికి చివరకు పంచపాండవులే మిగులుతారు. అనామకుడిగాజన్మించి, అనామకుడిగా లభించి, అనామకుడిగా పెరిగిన ఈ రాధేయుడు అనామకుడిగానే… అహ్ ! పాండవమాతా , వెళ్ళు ... నీ కోర్కె నెరవేరిందిగా, ఇక వెళ్ళు. 

2 comments:

  1. wow.. what a luck. I have been looking for this script all over the net and finally got it here. Thanks a lot! :-)

    ReplyDelete
  2. I want your contact number sir

    ReplyDelete